News August 23, 2025
ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు: అన్నమయ్య కలెక్టర్

అన్నమయ్య జిల్లాలో రసాయనిక ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ యూరియా కొరత రానివ్వకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
Similar News
News March 13, 2026
ఖమేనీ భార్య బతికే ఉన్నారు: ఇరాన్ మీడియా

US, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ <<19282331>>ఖమేనీ భార్య<<>> మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్ చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఇరానియన్ మీడియా ఖండించింది. ఆమె బతికే ఉన్నారని IRGC అనుబంధ మీడియా సంస్థ ‘ఫార్స్’ న్యూస్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ కూడా తన తొలి అధికారిక ప్రసంగంలో తల్లి మరణించారని ఎక్కడా ప్రస్తావించలేదు.
News March 13, 2026
WGL: వెంట్రుకల చోరీ కేసులో నలుగురి అరెస్టు

బట్టల బజార్‌లోని శ్యామల ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.10 లక్షల విలువైన వెంట్రుకలను దోచుకెళ్లిన కేసులో నలుగురు నిందితులను మట్వాడ పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 9న షేక్ బషీరా, షేక్ సలీమా, షేక్ నయీమ్,నాగన్న అనే వ్యక్తులు యజమాని కుమారస్వామిపై దాడి చేసి వెంట్రుకల బస్తాలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.
News March 13, 2026
ఆర్మూర్: టెన్త్ పరీక్షలు.. 5 నిమిషాల వెసులుబాటు

ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:35 గంటల వరకు (5 నిమిషాల ఆలస్యం) వచ్చే విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వస్తే అనుమతి ఉండదని చెప్పారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి వచ్చేందుకు ముందుగానే ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


