News August 23, 2025

ప్రకాశం జిల్లాలో 47200 అర్జీల పరిష్కారం

image

ప్రకాశం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చిన 47200 అర్జీలను పరిష్కరించినట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వివరించారు. ప్రజల అర్జీల పరిష్కారంపై ఒంగోలులోని కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించేలా, పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News August 23, 2025

అటువంటి ఉపాధ్యాయులను వదలొద్దు: కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడైనా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల పట్ల రాజీ పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్ పలువురు పాల్గొన్నారు.

News August 23, 2025

వారిపై కేసులు నమోదు చేస్తాం: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో అక్రమంగా ఎరువులను నిల్వ ఉంచేవారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కేసు నమోదుచేస్తామన్నారు.

News August 22, 2025

భూగర్భ జలాలు పెరిగేలా ప్రణాళికల తయారీ: కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో భూగర్భ జలమట్టం మరింత పెరిగేలా గ్రామస్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం భూగర్భ జల వనరులశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. 20 మీటర్లకంటే ఎక్కువ భూగర్భ జలమట్టం ఉన్న గ్రామాల్లో, జలమట్టం పెరిగే అవకాశంపై ప్రణాళికలు రూపొందించాలన్నారు.