News August 23, 2025
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఆహ్వానం అందింది. ఈవో పెంచల కిశోర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వాన పత్రికను అందించారు. కాగా ఇప్పటికే ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి
Similar News
News August 23, 2025
DSC ఫలితాల్లో తిరుపతి జిల్లా వాసి సత్తా.!

శుక్రవారం విడుదలైన మెగా DSC ఫలితాల్లో తిరుపతి జిల్లా యువకుడు సత్తా చాటాడు. ఎర్రవారిపాలెం మండలం ఓఎస్ గొల్లపల్లికి చెందిన ముండ్రే శేషాద్రి ఏకంగా ఐదు ఉద్యోగాలకు అర్హత సాధించాడు. ☞ S.A SOCIAL-80.63(9ర్యాంక్) ☞ SGT-86.33( 53ర్యాంక్) ☞ S.A తెలుగు -73.05(42ర్యాంక్) ☞ T.G.T తెలుగు -71.00(127ర్యాంక్) ☞ T.G.T SOCIAL-70.93(82ర్యాంక్) సాధించాడు. ఈ మేరకు ఆయన్ను పలువురు అభినందించారు.
News August 23, 2025
చిత్తూరు కలెక్టర్ పేరుతో ఫేక్ అకౌంట్.. కేసు నమోదు

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి, డబ్బులు డిమాండ్ చేయడంపై శుక్రవారం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రమేశ్ బాబు కథనం మేరకు.. కలెక్టర్ పేరుపై గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ ఐడీని క్రియేట్ చేశాడు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులను పరిచయం చేసుకొని డబ్బు అడగడం మొదలుపెట్టాడు. కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News August 22, 2025
చిత్తూరు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్

కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ప్రారంభించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో నిజమైన ఫేస్ బుక్ ఖాతా నుంచి అలెర్ట్ మెసేజ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మేరకు గురువారం కలెక్టర్ తన ఒరిజినల్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అత్యవసర సమాచారం అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. నకిలీ అకౌంట్‌తో జాగ్రత్త వహించాలని సూచించారు.