News August 23, 2025

తాడేపల్లిలో కాకాణితో ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి భేటీ

image

తాడేపల్లిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలు చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలపై మాట్లాడుకున్నారు.

Similar News

News August 23, 2025

నెల్లూరు: ఆథరైజ్డ్ బార్లకు నో రెస్పాన్స్

image

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బార్ల పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో ఆథరైజ్డ్ బార్ల దరఖాస్తులకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ఈనెల 18న జిల్లాలో బార్ల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలై ఇప్పటి వరకు ఐదు రోజులు కావస్తున్నా దరఖాస్తులు దాఖలు కాలేదు. నూతన బార్ల విధానం నిర్వహకులకు భారంగా మారుతుందని పలువురు వాపోయారు.

News August 23, 2025

DSC పేరిట మోసాలు.. DEO కీలక వ్యాఖ్యలు

image

డీఎస్సీ-25కు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మొద్దని నెల్లూరు DEO బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీల్లో పోస్టులు భర్తీ కొరకు కాల్ లెటర్ అందిన అభ్యర్థులు వ్యక్తిగతంగా సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌కు రావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు కుల ధ్రువీకరణ పత్రాలు మూడు సెట్లు జిరాక్స్, గెజిటెడ్ అటిస్ట్రేషన్తో పాటు 5 ఫోటోలు తీసుకురావాలని కోరారు.

News August 23, 2025

నెల్లూరు: 29 మంది MEOలకు నోటీసులు

image

ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించని జిల్లాలోని 29 MEOలకు DEO బాలాజీ రావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఫేస్ రికగ్నైజ్ యాప్(FRS)లో హాజరు నమోదు చేసుకోవాలి. అయితే అందుకు భిన్నంగా వారు హాజరు నమోదు చేసుకోకపోవడంతో సంజాయిషీ కోరుతూ నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.