News August 23, 2025

ములుగు జిల్లా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

ములుగు జిల్లాలో నిరుద్యోగ యువతకు SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా 18-45 ఏళ్ల ఉన్న నిరుద్యోగ యువతకు హౌస్ వైరింగ్, సెల్ఫోన్ రిపేర్‌లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఈ శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వరంగల్ జిల్లా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని కార్యాలయంలో ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ సూచించారు.

Similar News

News March 17, 2026

WGL: కోడి గుడ్డు ధరలు దిగి వస్తున్నాయి!

image

పశ్చిమాసియాలో యుద్ధ అనిశ్చితి కోడిగుడ్ల ధరలపై ప్రభావం చూపిస్తోంది. హనుమకొండ, వరంగల్ పరిసరాల్లో పౌల్ట్రీల నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో కోడిగుడ్ల ధరలు దిగి వచ్చాయి. జిల్లాలో పౌల్ట్రీ రైతులు రూ.7 చొప్పున హోల్ సేల్‌గా విక్రయిస్తే వినియోగదారులకు రూ.7.50 అమ్మేవారు. ఎగుమతులు తగ్గిపోవడంతో ప్రస్తుతం రూ.4.50 చొప్పున హోల్ సేల్‌గా అమ్ముతున్నారు. రిటైల్ మార్కెట్లో రూ.5కు లభిస్తోంది.

News March 17, 2026

ప్రకాశం: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. బేస్తవారిపేట(M) పూసలపాడుకు చెందిన మోతుకూరి కోలా పిచ్చయ్య(31)పై కేసు నమోదై దర్యాప్తు దర్వాప్తు నేరం రుజువైంది. ఈ సందర్భంగా బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్లు SP తెలిపారు. ముద్దాయికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసులను SP అభినందించారు.

News March 17, 2026

ఖమ్మం: మనస్తాపంతో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

image

మనస్తాపంతో ఎలుకల మందు సేవించి ఓ పీజీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన పి.శ్రీవిద్య కాకతీయ వర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్నారు. ఈ నెల 7న మధిరలో విషగుళికలు సేవించగా.. తొలుత ఖమ్మం ఆ తర్వాత హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.