News August 23, 2025

కర్నూలు: సాధారణ కార్యకర్తకు రాష్ట్ర అధ్యక్షుడి పదవి

image

భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కర్నూలు జిల్లాకు చెందిన సునీల్ రెడ్డిని నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్‌వీ మాధవ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి దశ నుంచే సునీల్ రెడ్డి ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేసి అనేక పోరాటాలను చేశారు. సునీల్ రెడ్డి నియామకం పట్ల జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో మంచి స్థానం ఉంటుందని అన్నారు.

Similar News

News August 23, 2025

మేజరైన యువతి కోరుకున్న వ్యక్తితో జీవించొచ్చు: హైకోర్టు

image

పెళ్లి కాని యువతి వివాహితుడితో కలిసి జీవించొద్దని చట్టంలో ఎక్కడా లేదని MP హైకోర్టు తెలిపింది. పురుషుడి భార్యకు తప్ప మరెవరికీ ఆమెపై ఫిర్యాదు చేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది. మేజరైన యువతికి నచ్చినవారితో జీవించే హక్కు ఉంటుందని పేర్కొంది. తమ కుమార్తె ఓ పెళ్లైన వ్యక్తితో వెళ్లిపోయిందని ఆమె పేరెంట్స్ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా పైవిధంగా తీర్పునిచ్చింది.

News August 23, 2025

PDPL: ‘జిల్లాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు’

image

PDPL జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ డా.శ్రీధర్ తెలిపారు. బెడ్స్ నిండినా ఎవరినీ వెనక్కి పంపకుండా ఫోల్డింగ్ మంచాలపై చికిత్స అందిస్తున్నామన్నారు. అవసరమైన మందులందిస్తున్నామని, రక్తపరీక్షలు ఆసుపత్రిలోనే చేస్తున్నామన్నారు. 100పడకల కొత్తాసుపత్రి పూర్తైతే స్థల సమస్య తగ్గుతుందని, సిబ్బంది తమ సామర్థ్యానికి మించి సేవలందిస్తున్నారని అన్నారు. ప్రజలు సహకరించాలన్నారు.

News August 23, 2025

HYD రావాలని OpenAIకి KTR విజ్ఞప్తి

image

ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేస్తామని ప్రకటించిన ప్రముఖ AI సంస్థ OpenAIని HYDకు రావాలని మాజీ మంత్రి KTR కోరారు. ‘హైదరాబాద్ అనువైన ప్రాంతం. ఇక్కడ THub, WEHub, TWorks, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సహా ఎన్నో ఉన్నాయి. MNCలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్, క్వాల్కమ్‌కు కేంద్రంగా ఉంది. AI విప్లవానికి శక్తినిచ్చే ప్రతిభ, ఆవిష్కరణలు, గ్లోబల్ కనెక్టివిటీని HYD తీసుకొస్తుంది’ అని Xలో పోస్ట్ చేశారు.