News April 2, 2024
అనకాపల్లి: యువకుడి ఆత్మహత్యపై కేసు

ఎస్.రాయవరం మండలం బంగారమ్మ పాలెం గ్రామానికి చెందిన కారే ఇస్సాక్ (25) పురుగుల తాగి సేవించి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విభీషణరావు చెప్పారు. ఒక యువతి విషయమై ఇస్సాక్‌ను ఆ కుటుంబ సభ్యులు తరచూ బెదిరించడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆదివారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.
Similar News
News September 9, 2025
ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ విజేత విజయవాడ బ్లాస్టర్స్

విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ఉమెన్ టీ20 క్రికెట్ లీగ్ 2025లో విజయవాడ బ్లాస్టర్స్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో రాయలసీమ రాణీస్‌పై 13 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ దక్కించుకుంది. మేఘన – 49, మహంతి శ్రీ – 37, రంగ లక్ష్మి – 33 పరుగులతో రాణించారు. బౌలింగ్‌లో రిషిక కృష్ణన్ 3 వికెట్లు తీసింది. మిథాలీ రాజ్ చేతుల మీదుగా జట్టు రూ.6 లక్షల ప్రైజ్ మనీతో ట్రోఫీ అందుకుంది.
News September 9, 2025
ఆరిలోవ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మూడసర్లోవ రిజర్వాయర్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అడవివరం నుంచి వస్తున్న వ్యానును ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో శ్రీ కృష్ణాపురం నివాసి గుడ్ల గోవిందరాజు (34), మరో యువకుడు హరీశ్ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ఎస్ఐ వై.కృష్ణ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించామన్నారు.
News September 9, 2025
జ్ఞానపురంలో అర్ధరాత్రి హల్చల్.. ఇంటి యజమానిపై దాడి

జ్ఞానపురంలో సోమవారం రాత్రి ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. ముగ్గురు మహిళలు ఉంటున్న ఇంటి తలుపులు, కిటికీలు కొట్టడంతో వారు ఇంటి యజమానికి ఫోన్ చేశారు. ఇంటి ఓనర్ పీలా శ్రీనివాసరావు (55), తన కుమారుడు పూర్ణ సాయితో వెళ్లి ప్రశ్నించగా దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు కంచరపాలెం CI రవి కుమార్ మంగళవారం తెలిపారు. నిందుతులు పాత నేరస్తులైన దేవర కళ్యాణ్, దుర్గా ప్రసాద్‌గా గురించారు.