News August 23, 2025

సెప్టెంబర్ 4న మంత్రివర్గ సమావేశం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సెప్టెంబర్ 4న వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా సెప్టెంబర్ రెండో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం.

Similar News

News August 23, 2025

నేడు ఖాతాల్లోకి డబ్బులు

image

AP: 2014-19 మధ్య జరిగిన నరేగా(ఉపాధి హామీ పథకం) పనుల బిల్లులు ఇవాళ విడుదల కానున్నాయి. క్లోజ్ చేసిన 3,54,177 పనులను CM చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి ఆన్ గోయింగ్ వర్కులుగా మార్పు చేయించారని TDP తెలిపింది. దీంతో ₹180Cr చెల్లింపులకు మార్గం ఏర్పడిందని, అందులోంచి ₹145Cr ఇవాళ కాంట్రాక్టర్లు, కార్మికుల ఖాతాల్లో జమ కానున్నట్లు పేర్కొంది. YCP ప్రభుత్వం కుట్ర పూరితంగా వీటిని నిలిపివేసిందని ఆరోపించింది.

News August 23, 2025

సిరాజ్‌ను అందుకే వదులుకున్నాం: ఆర్సీబీ

image

IPL2025 వేలానికి ముందు సిరాజ్‌ను వదులుకోవడానికి గల కారణాలను RCB డైరెక్టర్ మో బోబట్ వెల్లడించారు. ‘ఆక్షన్‌కి ముందు సిరాజ్ గురించే ఎక్కువగా చర్చించాం. అతడితోనూ మాట్లాడాం. వేలంలో ఇండియన్ ఇంటర్నేషనల్ బౌలర్లను దక్కించుకోవడం కష్టం. న్యూ బాల్‌తోపాటు డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగల భువనేశ్వర్‌ను తీసుకోవాలనుకున్నాం. దీంతో సిరాజ్‌ను రిటైన్ చేసుకోవడం కష్టమైపోయింది. దీనికి ఇతర కారణాలూ ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

News August 23, 2025

మేజరైన యువతి కోరుకున్న వ్యక్తితో జీవించొచ్చు: హైకోర్టు

image

పెళ్లి కాని యువతి వివాహితుడితో కలిసి జీవించొద్దని చట్టంలో ఎక్కడా లేదని MP హైకోర్టు తెలిపింది. పురుషుడి భార్యకు తప్ప మరెవరికీ ఆమెపై ఫిర్యాదు చేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది. మేజరైన యువతికి నచ్చినవారితో జీవించే హక్కు ఉంటుందని పేర్కొంది. తమ కుమార్తె ఓ పెళ్లైన వ్యక్తితో వెళ్లిపోయిందని ఆమె పేరెంట్స్ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా పైవిధంగా తీర్పునిచ్చింది.