News August 23, 2025
నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేసింది. మరోవైపు ఏపీలోని కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.
Similar News
News August 23, 2025
నేడు ఖాతాల్లోకి డబ్బులు

AP: 2014-19 మధ్య జరిగిన నరేగా(ఉపాధి హామీ పథకం) పనుల బిల్లులు ఇవాళ విడుదల కానున్నాయి. క్లోజ్ చేసిన 3,54,177 పనులను CM చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి ఆన్ గోయింగ్ వర్కులుగా మార్పు చేయించారని TDP తెలిపింది. దీంతో ₹180Cr చెల్లింపులకు మార్గం ఏర్పడిందని, అందులోంచి ₹145Cr ఇవాళ కాంట్రాక్టర్లు, కార్మికుల ఖాతాల్లో జమ కానున్నట్లు పేర్కొంది. YCP ప్రభుత్వం కుట్ర పూరితంగా వీటిని నిలిపివేసిందని ఆరోపించింది.
News August 23, 2025
సిరాజ్‌ను అందుకే వదులుకున్నాం: ఆర్సీబీ

IPL2025 వేలానికి ముందు సిరాజ్‌ను వదులుకోవడానికి గల కారణాలను RCB డైరెక్టర్ మో బోబట్ వెల్లడించారు. ‘ఆక్షన్‌కి ముందు సిరాజ్ గురించే ఎక్కువగా చర్చించాం. అతడితోనూ మాట్లాడాం. వేలంలో ఇండియన్ ఇంటర్నేషనల్ బౌలర్లను దక్కించుకోవడం కష్టం. న్యూ బాల్‌తోపాటు డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగల భువనేశ్వర్‌ను తీసుకోవాలనుకున్నాం. దీంతో సిరాజ్‌ను రిటైన్ చేసుకోవడం కష్టమైపోయింది. దీనికి ఇతర కారణాలూ ఉన్నాయి’ అని పేర్కొన్నారు.
News August 23, 2025
మేజరైన యువతి కోరుకున్న వ్యక్తితో జీవించొచ్చు: హైకోర్టు

పెళ్లి కాని యువతి వివాహితుడితో కలిసి జీవించొద్దని చట్టంలో ఎక్కడా లేదని MP హైకోర్టు తెలిపింది. పురుషుడి భార్యకు తప్ప మరెవరికీ ఆమెపై ఫిర్యాదు చేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది. మేజరైన యువతికి నచ్చినవారితో జీవించే హక్కు ఉంటుందని పేర్కొంది. తమ కుమార్తె ఓ పెళ్లైన వ్యక్తితో వెళ్లిపోయిందని ఆమె పేరెంట్స్ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా పైవిధంగా తీర్పునిచ్చింది.