News August 23, 2025

ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు: అన్నమయ్య కలెక్టర్

image

అన్నమయ్య జిల్లాలో రసాయనిక ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ యూరియా కొరత రానివ్వకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Similar News

News March 21, 2026

అమలాపురం: గ్యాస్ బుకింగ్ పేరిట సైబర్ మోసం- DSP

image

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులే లక్ష్యంగా కొత్త తరహా సైబర్ మోసాలు సాగుతున్నాయని డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు. ‘GAS BILL UPDATE APK’ వంటి హానికరమైన ఫైళ్లను వాట్సాప్ ద్వారా పంపి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారని తెలిపారు. ఇటువంటి అనుమానాస్పద అప్లికేషన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని కోరారు.

News March 21, 2026

రేపు కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు

image

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి 60 రోజులుగా చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే. ఎర్రంపల్లిలో ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. సర్పంచిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 1998లో మార్కెఫెడ్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో తొలిసారి TDP అభ్యర్థిగా పోటీచేసి రఘువీరా రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు.

News March 21, 2026

జనగామ: తీరనున్న విద్యార్థుల అర్ధాకలి చదువులు!

image

జిల్లాలోని 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 2 వేల మంది విద్యార్థులకు ఆకలి కష్టాలు తప్పనున్నాయి. నిండు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే విద్యార్థులకు సమయానికి బస్సులు లేక, బస్సులు వచ్చే సమయానికి వంట కాక ఇబ్బందులు పడ్డారు.