News August 23, 2025

ఈ నెల 25న అల్పపీడనం.. భారీ వర్షాలు!

image

బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలోని ఒడిశా-ప.బెంగాల్ తీరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖఫట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Similar News

News August 23, 2025

పూజలో అరటి, కొబ్బరికాయలే ఎందుకు?

image

పూజలో కొబ్బరికాయ, అరటిపండును ప్రసాదంగా సమర్పించడం చూస్తుంటాం. అయితే ప్రత్యేకంగా వీటినే ఎందుకు ఎంచుకుంటారో చాలా మందికి తెలియదు. ఇవి పూర్ణ ఫలాలు (ఎంగిలి కానివి) కావడంతోనే ఇలా చేస్తారని పండితులు చెబుతున్నారు. తిని పారేసిన పండు గింజల ద్వారా కాకుండా మొత్తం కొబ్బరికాయను భూమిలో నాటితే మొక్క వస్తుంది. అలాగే అరటి చెట్టు పండులోని గింజల ద్వారా కాకుండా, మొదలు నుంచి వచ్చే పిలకల ద్వారా కాస్తుందట. SHARE IT

News August 23, 2025

త్వరలో MHలో ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫ్రీ?

image

ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్రంలోని హైవేలపై టోల్ ఛార్జీలను మహారాష్ట్ర ప్రభుత్వం మినహాయించనుంది. ఇప్పటికే అటల్ సేతు, పుణే ఎక్స్‌ప్రెస్‌వే, సమృద్ధి మహామార్గ్‌లపై ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఇచ్చింది. త్వరలో రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాలకు దీనిని విస్తరించాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. కాలుష్యం తగ్గించడం, EVల కొనుగోలు ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.

News August 23, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

☛ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు రూ.375 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
☛ సీఎం రేవంత్‌తో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ
☛ ‘హైడ్రా’ ఒకట్రెండు ఏళ్లకు పరిమితం కాదు.. వందేళ్ల ప్రణాళికతో ముందుకెళ్తోంది: కమిషనర్ రంగనాథ్
☛ నేను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి