News August 23, 2025

కృష్ణా జిల్లాలో అండర్-17 ఫెన్సింగ్ జట్ల ఎంపికలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పొన్నవరం ఏకత్వా పాఠశాలలో ఈనెల 25న అండర్-17 బాల, బాలికల ఫెన్సింగ్ జట్ల ఎంపికలు జరుగుతాయని జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి సతీశ్ బాబు శుక్రవారం తెలిపారు. డిసెంబర్ 31, 2025 నాటికి 17 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు కార్డు, ఫెన్సింగ్ కిట్‌తో హాజరుకావాలని కోరారు.

Similar News

News March 19, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 19, 2026

ఓటుకు నోటు దొంగ రేవంత్: హరీశ్ రావు

image

TG: వీధి దీపాలు కూడా సరిగా పెట్టడం చేత కాని సీఎం రేవంత్ విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. ప్రజలకు గ్యారంటీల పేరు చెప్పి, మాయ చేసి ఓట్లు దండుకున్న రేవంత్‌ను మించిన మారీచుడు ఇంకెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. రైతు ద్రోహి అని, ఓటుకు నోటు దొంగ అని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు దిక్కు లేదని, ప్రభుత్వానికి ముందుంది మొసళ్ల పండగని హెచ్చరించారు.

News March 19, 2026

ఈరోజు నమాజ్ వేళలు (19-3-2026) గురువారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.09 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:21 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.40 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.