News August 23, 2025

జీవీఎంసీ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలకు ఆమోదం

image

జీవీఎంసీ సర్వసభ్య సమావేశంలో 151 అంశాలు చర్చకు రాగా 84 ప్రధాన అజెండా, 67 టేబుల్ అజెండాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశానికి మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్, శాసనసభ్యులు, కార్పొరేటర్లు హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించారు. జీరో అవర్‌లో వార్డుల్లోని సమస్యలు చర్చించగా, వాటి పరిష్కారానికి మేయర్ హామీ ఇచ్చారు.

Similar News

News September 8, 2025

విశాఖ: సెప్టెంబర్ 10న స్థాయీ సంఘాల సమావేశం

image

జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు సెప్టెంబర్ 10న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగనున్నాయని జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ జె.సుభద్ర ఆధ్వర్యంలో వి.సి.హాల్ సమావేశ మందిరంలో 1-7వ స్థాయీ సంఘాలు వేర్వేరుగా ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య జరుగుతాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతి నివేదికలతో హాజరుకావాలని కోరారు.

News September 8, 2025

విశాఖ: బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు అరెస్ట్

image

విశాఖలోని సీతమ్మధార వద్ద మూగ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ద్వారకా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్సార్ నగర్‌లో తల్లిదండ్రులతో నివాసం ఉంటున్న బాలికపై ఆదివారం సాయంత్రం ఇద్దరు మైనర్లు అత్యాచారం చేశారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ద్వారకా పోలీసులు స్పందించి అత్యాచారం చేసిన ఇద్దరు బాలురను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News September 8, 2025

విశాఖ: బీజేపీలో కొత్త జోనల్ ఇన్‌ఛార్జ్ నియామకం

image

విశాఖలో BJP రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో కొత్త జోనల్ ఇన్‌ఛార్జులను ప్రకటించారు. ఉత్తరాంధ్ర జోన్‌కు మట్టా ప్రసాద్, గోదావరి జోన్‌కు లక్ష్మీప్రసన్న, కోస్తాంధ్ర జోన్‌కు నాగోతు రమేష్‌నాయుడు, రాయలసీమ జోన్‌కు ఎన్.దయాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ బలోపేతానికి వీరు సమన్వయం చేస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.