News August 23, 2025
VZM: ఎరువుల కొరత.. కలెక్టర్ కీలక ఆదేశాలు

మండల స్థాయిలో MRO, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహశీల్దార్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం ప్రకటించారు. దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, RSKలను తనిఖీ చేయిస్తామన్నారు. షాపులకు సరఫరా అయిన ఎరువులు, పంపిణీ, నిల్వలపై వారం రోజుల్లో తమకు నివేదికను అందజేయాలని ఆదేశించారు. పక్కదారి పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 2, 2026
VZM: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఎస్‌బీఐ ఆర్‌సెటీ ద్వారా గ్రామీణ మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ భాస్కరరావు తెలిపారు. ఈ నెల 6 నుంచి టైలరింగ్, ఎంబ్రాయిడరీ &ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కోర్సులు నిర్వహిస్తామన్నారు. 18-50 ఏళ్ల వయస్సు గల మహిళలు 9959521662 నంబర్‌కు ఫోన్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. భోజనం,వసతి ఉచితమని, ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేయాలని సూచించారు.
News April 1, 2026
VZM: తాగునీటి వేసవి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

వేసవి కాలంలో గ్రామాలు, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో సురక్షిత తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో తాగునీటి వేసవి ప్రణాళికపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఓ ప్లాంట్లు లేని పాఠశాలలు, వసతి గృహాల జాబితా సిద్ధం చేసి అవసరమైన చోట జల జీవన్ మిషన్ ద్వారా కుళాయిల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
News April 1, 2026
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకులు మెరుగుపరచాలి: VZM కలెక్టర్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు మున్సిపాలిటీలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, ప్లాస్టిక్ కవర్ల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


