News August 23, 2025

12 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు: ADR

image

దేశంలో 30 మంది సీఎంలు ఉండగా 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ADR (ASSOCIATION FOR DEMOCRATIC REFORMS) తెలిపింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89, తమిళనాడు సీఎం స్టాలిన్‌పై 47 కేసులు ఉన్నాయని పేర్కొంది. ఏపీ సీఎం చంద్రబాబు 19 క్రిమినల్ కేసులతో మూడో స్థానంలో ఉన్నారని వెల్లడించింది. సీఎంలు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ వివరాలతో ADR ఈ రిపోర్టును విడుదల చేసింది.

Similar News

News August 23, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

☛ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు రూ.375 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
☛ సీఎం రేవంత్‌తో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ
☛ ‘హైడ్రా’ ఒకట్రెండు ఏళ్లకు పరిమితం కాదు.. వందేళ్ల ప్రణాళికతో ముందుకెళ్తోంది: కమిషనర్ రంగనాథ్
☛ నేను ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

News August 23, 2025

రింకూ-ప్రియ మధ్య ప్రేమ మొదలైంది ఇలానే!

image

ప్రియా సరోజ్‌తో ప్రేమ ఎలా మొదలైందో స్టార్ క్రికెటర్ రింకూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘2022లో ముంబైలో IPL మ్యాచ్ జరిగినప్పుడు SMలో <<16639641>>ప్రియ<<>> ఫొటోను చూసి తనే నాకు సరైన భాగస్వామి అనుకున్నా. కానీ ఆమెకు ఆ విషయం చెప్పడానికి ధైర్యం చాలలేదు. కొన్ని రోజులకు ఇన్‌స్టాలో ఆమె నా ఫొటోలకు లైక్ చేయడంతో మెసేజ్ చేశా. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడుతున్నా. అలా ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పారు.

News August 23, 2025

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు TG సర్కార్?

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగా, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంపై ఇవాళ్టి PAC సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రిజర్వేషన్ల అంశం తేలకపోతే పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.