News August 23, 2025

సూర్యాపేట: SRSP నిండితేనే ఆ చెరువులకు నీళ్లు..

image

సాగర్ వరద పోటెత్తుతుండడంతో KDD, HNR నియోజకవర్గాల్లో సాగు నీటికి ఢోకా లేదు. అయితే తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో రైతులకు మాత్రం SRSP జీవనాధారం. ఆ ప్రాజెక్టు నిండితేనే ఈ నియోజకవర్గాల్లో చెరువులు నిండేది. కాల్వలు పారేది. అప్పుడే ఆ ఆయకట్టు రైతులకు రెండు సీజన్ల పంటలకు నీరు వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యాపేట జిల్లాలో మొత్తం 1200 పైనే చెరువులు ఉండగా దాదాపు 900 చెరువులు ఆ ప్రాజెక్టు కిందే ఉన్నాయి.

Similar News

News March 11, 2026

కడప: వీరికి డాక్టరేట్లు ఇవ్వనున్న వైవీయూ

image

YVU స్నాతకోత్సవంలో ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయనున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. తేలికపాటి యుద్ధ విమానాల రూపకర్త డా.కోటా హరినారాయణ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి ప్రెసిడెంట్ డా. శేఖర్. సి. మండేలకు గౌరవ డాక్టరేట్‌లను గవర్నర్ అబ్దుల్ నజీర్ అందజేస్తారన్నారు. వీరి జీవితం నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

News March 11, 2026

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: జడ్జి భవాని చంద్ర

image

మహిళలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కోర్టులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయంతి, శ్రీలేఖ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

News March 11, 2026

సిరిసిల్ల: ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు

image

ఫైరింగ్, రాత పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరచిన పోలీస్ ఉద్యోగులకు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే బహుమతి ప్రశంసా పత్రాలను బుధవారం అందజేశారు. సిరిసిల్లలో జరిగిన ఫైరింగ్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బి.శ్రీనివాస్, జి.వెంకటేష్, ఏ.ప్రియాంకకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే రాత పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, ప్రియాంకకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందించారు.