News August 23, 2025
భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్.. కేంద్రం క్లారిటీ

భారత్‌లో మళ్లీ<<17486073>> టిక్‌టాక్<<>> వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ‘టిక్‌టాక్‌పై నిషేధం ఇంకా కొనసాగుతోంది. దానిని అన్‌బ్లాక్ చేసినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు’ అని స్పష్టం చేసింది. భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతుండటంతో ఈ ప్రచారం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News August 23, 2025
అధికారికంగా సురవరం అంత్యక్రియలు: రేవంత్

TG: కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని CM రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని CSకు ఆయన సూచించారు. కాగా రేపు మ.3 గంటల వరకు హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌లో భౌతికకాయాన్ని ఉంచి, ఆ తర్వాత గాంధీ కాలేజీకి అప్పగిస్తారు. భౌతికకాయం అప్పగించే ముందు పోలీసులు అధికార లాంఛనాలతో గౌరవ వందనం సమర్పిస్తారు.
News August 23, 2025
ఉద్యోగుల బకాయిల లెక్కలు తేల్చాలి: బొప్పరాజు

AP: ఉద్యోగులకు సంబంధించి ఏ అంశంపైనా ప్రభుత్వం చర్చించట్లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో ఇవాళ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ‘ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల లెక్కలు తేల్చాలి. 3 నెలల్లో ఆర్థిక, ఆర్థికేతర అంశాలు పరిష్కరించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
News August 23, 2025
పూజలో అరటి, కొబ్బరికాయలే ఎందుకు?

పూజలో కొబ్బరికాయ, అరటిపండును ప్రసాదంగా సమర్పించడం చూస్తుంటాం. అయితే ప్రత్యేకంగా వీటినే ఎందుకు ఎంచుకుంటారో చాలా మందికి తెలియదు. ఇవి పూర్ణ ఫలాలు (ఎంగిలి కానివి) కావడంతోనే ఇలా చేస్తారని పండితులు చెబుతున్నారు. తిని పారేసిన పండు గింజల ద్వారా కాకుండా మొత్తం కొబ్బరికాయను భూమిలో నాటితే మొక్క వస్తుంది. అలాగే అరటి చెట్టు పండులోని గింజల ద్వారా కాకుండా, మొదలు నుంచి వచ్చే పిలకల ద్వారా కాస్తుందట. SHARE IT