News August 23, 2025

ఐటీఐ వాక్-ఇన్ అడ్మిషన్లు ప్రారంభం

image

ప్రభుత్వ ఐటీఐలో వాక్-ఇన్ అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, దరఖాస్తు చేయడానికి ఆగస్టు 28 చివరి తేదీ అని భూపాలపల్లి ఐటీఐ ప్రిన్సిపల్ జుమ్లానాయక్ తెలిపారు. పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు నేరుగా భూపాలపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీ కేంద్రానికి తమ సర్టిఫికెట్లతో హాజరుకావొచ్చన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, బీఈడీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News August 23, 2025

సెప్టెంబర్ 6న భద్రాద్రి జిల్లాకు KTR రాక

image

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే నెల జిల్లాలో పర్యటించనున్నారని BRS నాయకుడు దిండిగాల రాజేందర్ వెల్లడించారు. ఇల్లందులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెప్టెంబర్ 6న కొత్తగూడెం, భద్రాచలంలో కేటీఆర్ పర్యటిస్తారని తెలిపారు. ఆయన పర్యటన విజయవంతానికి ఈనెల 24న కొత్తగూడెంలోని BRS జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News August 23, 2025

భద్రాచలం: మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

image

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు 38 అడుగులు వద్ద గోదావరి నీటిమట్టం ప్రవహిస్తూ ఉంది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. గోదావరిలో స్నానాలకు, ఈత కొట్టడానికి, చేపల వేటకు ఎవరు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.

News August 23, 2025

యూరియా సరఫరా సజావుగా జరగాలి: కలెక్టర్

image

దుర్శేడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం సందర్శించారు. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. యూరియా అక్రమంగా నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం సంఘం ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, సహకార సంఘం అధికారులు, సిబ్బంది ఉన్నారు.