News August 23, 2025
GNT: ఆయన సీఎంగా ఉన్నప్పుడే బ్యారేజ్ నిర్మాణం

ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి (1872 ఆగష్టు 23 – 1957 మే 20) గుంటూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరిలో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తిలో ఉండేది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా నదిపై ప్రకాశం బారేజి నిర్మాణం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన,2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రముఖమైనవి.
Similar News
News August 23, 2025
దివ్యాంగులకు కేంద్ర స్కాలర్షిప్లు: కలెక్టర్

దివ్యాంగులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు అందిస్తుందని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఈ నెల 31 లోపు, ఇంటర్ ఆ పైన చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు www.depwd.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె వెల్లడించారు.
News August 23, 2025
GNT: జి.వి. కృష్ణారావు గొప్ప ఆల్‌రౌండర్

గవిని వెంకట కృష్ణరావు గుంటూరు జిల్లా కూచిపూడిలో 1914లో జన్మించారు. హేతువాది, ప్రముఖ రచయిత, దార్శనికులుగా, నవలా రచయితగా, కథా రచయితగా, వ్యాసకర్తగా, ప్రసార ప్రముఖునిగా, సంస్కృతాధ్యాపకుడుగా, తత్వవేత్తగా రాణించారు. ఆంధ్రప్రభలో సబ్ఎడిటర్గా, రాడికల్ డెమోక్రాట్, విహారి, దేశాభిమాని, విజయప్రభ పత్రికలలో ఎడిటర్‌గా పనిచేశారు. స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయంలో పీహెచ్డీ పొందారు. 1978 ఆగష్టు 23న మరణించారు.
News August 23, 2025
సమన్వయంతో పనులు చేయాలి: జేసీ భార్గవ్ తేజ

రెవెన్యూ, సర్వే, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సూచించారు. స్వామిత్వ రీ సర్వే పురోగతి పై శుక్రవారం జేసీ సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. డిప్యూటీ ఎంపీడీవోలు మండల స్థాయిలో మానిటరింగ్ చేస్తూ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.