News April 2, 2024
పెన్షన్ల జాప్యానికి కారణం సీఎం జగనే: కొల్లు రవీంద్ర

AP: రాజకీయ లబ్ధి కోసం పింఛన్లు ఇవ్వకుండా పెన్షనర్లను సీఎం జగన్ వేధిస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్ మెప్పు కోసం అబద్దాలే ఎజెండాగా పేర్ని నాని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సేవ చేసే వాలంటీర్లను తాము కొనసాగిస్తామంటే వైసీపీ నేతలకు వణుకెందుని ప్రశ్నించారు. పింఛన్ల జాప్యానికి నూటికి నూరు శాతం కారణం జగనే అని విరుచుకుపడ్డారు.
Similar News
News March 21, 2026
ఉదయాన్నే కాఫీ/టీ తాగితే..

కాఫీ, టీ తాగితే మంచిదా? కాదా? అనే అంశంపై విభిన్న ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. తాజాగా USకు చెందిన హార్వర్డ్, MIT సైంటిస్టులు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఉదయాన్నే కెఫిన్ ఉన్న కాఫీ/టీని మితంగా తీసుకుంటే డిమెన్షియా(మతిమరుపు) ప్రమాదం 18% తగ్గుతుందని పేర్కొన్నారు. స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. 43 ఏళ్లలోపు వయసున్న 1,31,821 మంది డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని తెలిపారు.
News March 21, 2026
తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది: బండి సంజయ్

తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇది ప్రజలను వంచించే బడ్జెట్ అని, అంకెల ఆర్భాటాలు తప్ప ఒరిగేదేమీ లేదని మీడియాతో అన్నారు. 6 గ్యారంటీలను గాలికి వదిలేశారని ఫైరయ్యారు. ‘డ్రగ్స్ కేసులో సీఎంకు చిత్తశుద్ధి లేదు. ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే’ అని ఆరోపించారు.
News March 21, 2026
నేడు, రేపు వర్షాలు: APSDMA

AP: బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వానలు పడతాయని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు విజయనగరం, VZG, అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ATP, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


