News August 23, 2025
అటువంటి ఉపాధ్యాయులను వదలొద్దు: కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల పట్ల రాజీ పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్ పలువురు పాల్గొన్నారు.
Similar News
News March 29, 2026
ప్రకాశం: IPL.. జిల్లా SP స్ట్రాంగ్ వార్నింగ్..!

ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహించినా చట్టపరమైన శిక్షలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలతో ఈ బెట్టింగ్ మాఫియాపై నిఘా పెంచినట్లు తెలిపారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండి, క్రికెట్‌ను కేవలం వినోదంగానే చూడాలని సూచించారు.
News March 28, 2026
ఒంగోలు: కుక్క అడ్డు రావడంతో ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి

ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట రమణయ్య శనివారం రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. బైక్ పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో బైక్ స్కిడ్ అయి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో పోలీస్ శాఖలో, కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.