News August 23, 2025
అనకాపల్లి: ‘40 వేల హెక్టార్లలో వరి నాట్లు’

అనకాపల్లి జిల్లాలో ఇప్పటివరకు 40 వేల హెక్టార్లలో రైతులు వరి నాట్లు వేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు శుక్రవారం తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 56 వేల హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వచ్చేనెల మొదటి వారానికి లక్ష్యాన్ని అధిగమించనున్నట్లు చెప్పారు. వర్షాలు ఆలస్యంగా పడడం వల్ల జూలైలో వేయాల్సిన నాట్లు ఆగస్టులో వేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 11, 2026
IPL-2026: ఫస్ట్ మ్యాచ్ ఈ జట్ల మధ్యే?

ఈసారి ఐపీఎల్ ఆరంభ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ తలపడబోవని క్రిక్‌బజ్ తెలిపింది. బెంగళూరు, పంజాబ్ వేర్వేరుగా ఆడనున్నాయని పేర్కొంది. సంప్రదాయం ప్రకారం హై ప్రొఫైల్ మ్యాచుతో టోర్నమెంట్ స్టార్ట్ చేస్తారు. ఈసారి ఫస్ట్ మ్యాచ్ మార్చి 28న బెంగళూరు-చెన్నై మధ్య జరిగే అవకాశం ఉందని తెలిపింది. రన్నరప్ అయిన పంజాబ్ 29న GTతో ఆడవచ్చని వెల్లడించింది. కాగా మార్చి 12/13న IPL షెడ్యూల్ రిలీజ్ కానుంది.
News March 11, 2026
దేవరకద్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గండీడు (36.0), భూత్పూర్ (35.7), కోయిలకొండ (35.6) మండలాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంది. చిన్నచింతకుంట, అడ్డాకుల, నవాబుపేట ప్రాంతాల్లో 34 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News March 11, 2026
చిత్తూరు జిల్లాలో గ్యాస్ కష్టాలు..!

యుద్ధం నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోనూ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్ తీసుకున్న 25 రోజుల తర్వాతే మరో సిలిండర్ బుక్ చేసుకోవాలి. గ్యాస్ బుకింగ్ OTP ఉంటేనే సిలిండర్ సప్లై చేస్తున్నారు. అయితే బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల తర్వాతే సిలిండర్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కష్టాలు లేకపోయినా పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్తులో గ్యాస్ కష్టాలు తప్పేటట్లు లేదు.


