News August 23, 2025
MNCL: సీపీఐ రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు చోటు

సీపీఐ రాష్ట్ర కమిటీలో మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు నేతలకు చోటు లభించింది. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జరిగిన సీపీఐ నాలుగో రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా కలవేన శంకర్, రాష్ట్ర సమితి సభ్యులుగా సీతారామయ్య, రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, క్యాండిడేట్ సభ్యులుగా జోగుల మల్లయ్య, ఆహ్వానితులుగా ఇప్పకాయల లింగయ్య, బొల్లం పూర్ణిమ ఎన్నికయ్యారు.
Similar News
News March 6, 2026
ఇరాన్‌పై US దాడులు.. ఏఐతో సెకన్లలో ప్లానింగ్!

US మిలిటరీకి AI కొత్త అస్త్రంగా మారింది. ఇరాన్‌పై దాడులు స్టార్ట్ చేసినప్పుడు 12 గంటల్లో 900కుపైగా లక్ష్యాలపై అటాక్ ఏఐతోనే సాధ్యమైంది. మేవెన్ స్మార్ట్ సిస్టమ్ 150కిపైగా సోర్సుల నుంచి రహస్య డేటా సేకరించి సెకన్లలో టార్గెట్స్ సెట్ చేసింది. సాధారణంగా ఈ ప్రక్రియకు కొన్నిరోజులు పడుతుంది. అయితే పాత డేటాతో తప్పుడు లక్ష్యాలపై దాడి జరిగే ప్రమాదం ఉంది. స్కూల్‌పై <<19288920>>దాడి<<>> అలాగే అయి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.
News March 6, 2026
NGKL: బాలికపై అత్యాచారయత్నం.. UPDATE

ఉప్పునుంతల(M) ఓ గ్రామంలో గిరిజన బాలికపై అత్యాచారయత్నం చేసిన ఇద్దరి యువకులపై కేసు నమోదు చేసినట్లు SI వెంకట్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల నాటకం చూసి ఇంటికి వెళ్తున్న బాలికను బలవంతంగా ఓ దుకాణంలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించారు. బాలిక వద్ద ఉన్న సెల్ లైట్‌తో వారి ముఖాలు గుర్తించింది. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 6, 2026
నాగర్‌కర్నూల్: ఫోక్సో కేసులో 20 ఏళ్లు జైలు

ఫోక్సో కేసులో ఓ నిందితుడికి నాగర్ కర్నూల్ కోర్టు 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. NGKLలోని శ్రీపురం రోడ్డు సంజయ్ నగర్ కాలనీకి చెందిన సుజిత్ కుమార్(గణేష్) (21)పై 2024లో క్రైమ్ నెంబర్ 294 ఫోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం జిల్లా స్పెషల్ జడ్జి నసీం సుల్తానా నిందితుడికి 20ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ.20వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ తెలిపారు.


