News August 23, 2025
రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ల బదిలీ

రంగారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ నారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమనగల్లు తహశీల్దార్‌గా మహమ్మద్ ఫయీం ఖాద్రీ, తలకొండపల్లి తహశీల్దార్‌గా రమేశ్, ఫరూఖ్‌నగర్‌కు నాగయ్య, నందిగామ తహశీల్దార్‌గా సైదులు, మహేశ్వరం తహసీల్దార్‌గా చిన్న అప్పలనాయుడు, కొందుర్గు తహశీల్దార్‌గా రాజేందర్‌రెడ్డిని నియమించారు.
Similar News
News April 4, 2026
రాజేంద్రనగర్‌లో హైకోర్టు భవనానికి శంకుస్థాపన

రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పాల్గొన్నారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి ఆయనకి గణస్వాగతం పలికారు. CS కె.రామకృష్ణారావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ తదితరులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.
News April 4, 2026
సరూర్‌నగర్: 7న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లా స్థాయి ఫెడరేషన్ కప్ పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ పోటీల వివరాలను సంఘం కార్యదర్శి గోపి వెల్లడించారు. 16 ఏళ్లు పైబడిన వారు, అలాగే అండర్-20 పురుషులు, మహిళా విభాగాల్లో ఈ క్రీడలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News April 2, 2026
RR: గ్రామసభలు ప్రజా సమస్యల కోసమా? ప్రచారం కోసమా?

గ్రామ సమస్యలు, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం జరగాల్సిన గ్రామసభలు పక్కదారి పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను చర్చించాల్సింది పోయి, అధికారులు కేవలం ప్రభుత్వ పథకాలకు ‘డప్పు’ కొట్టడానికే పరిమితమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలకు అందాల్సిన పథకాలు పైరవీకారుల పాలవుతున్నాయని, అధికారులు అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.


