News August 23, 2025
విశాఖ: సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌కు 32 మంది గైర్హాజరు

కానిస్టేబుల్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ విశాలాక్షి నగర్ ఏఆర్ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించారు. 659 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 627 మంది వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారని, మిగతా 32మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉందని అధికారులు తెలిపారు. అదనపు ఎస్పీలు దేవప్రసాద్, మోహన్‌రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు 70 మందిలో 69 మంది హాజరు కాగా ఒకరు హాజరు కాలేదు.
Similar News
News March 13, 2026
విశాఖ: బుకింగ్ చేసినా ఆలస్యంగా గ్యాస్ డెలివరీ..!

విశాఖలో గ్యాస్ సరఫరా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో మొత్తం 62 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా సుమారు 9 లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు 26,000 నుంచి 30,000 సిలిండర్లు డెలివరీ అయ్యేవి. అయితే ప్రస్తుతం రోజువారీ సరఫరా 16,000 నుంచి 19,000 సిలిండర్లకు తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో సిలిండర్ 24 గంటల్లో అందుతుండగా, ప్రస్తుతం వినియోగదారులు 7 రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News March 13, 2026
మార్చి15న విశాఖకు మాజీ ఉపరాష్ట్రపతి

భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు మార్చి 15న విశాఖ రానున్నారు.15న రాత్రి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని కిర్లంపూడి లేఅవుట్‌లోని తన నివాసంలో బస చేస్తారు. మార్చి 17న సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించే ఉగాది పురస్కార కార్యక్రమంలో పాల్గొంటారు. 19న ఉదయం విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు.
News March 13, 2026
నేడు విశాఖ రానున్న డిప్యూటీ సీఎం పవన్

డిప్యూటీ సీఎం పవన్ నేడు విశాఖ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం హెలికాప్టర్ ద్వారా అల్లూరి జిల్లాకి బయలుదేరుతారు. నందిగరువులో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు అక్కడి నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి బేగంపేటకు తిరుగు పయనమవుతారు.


