News August 23, 2025
69 మంది బాధితులకు రూ.55.50 లక్షలు పంపిణీ

విశాఖ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రం ద్వారా కమిషనర్ ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల హిట్ & రన్ ప్రమాదాల్లో తీవ్ర గాయాల పాలైన వారికి రూ.50 వేలు చొప్పున ఆరుగురికి రూ.3 లక్షలు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. విశాఖలో ఇప్పటి వరకు 69 మంది రోడ్డు ప్రమాద భాదితులకు సహాయక కేంద్రం ద్వారా రూ.55.50 లక్షలు పరిహారం అందజేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
Similar News
News August 23, 2025
విశాఖ పోలీస్ సిబ్బందికి పదోన్నతులు

విశాఖ కమీషనరేట్ పరిధిలో 29 మంది పోలీస్ సిబ్బందికి పదోన్నతలు లభించాయి. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వారిని శనివారం సత్కరించి, పదోన్నతి ర్యాంకులతో పాటుగా పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని సీపీ సూచించారు. వీరిలో 13మంది హెడ్ కానిస్టేబుళ్లు.. ఏఎస్ఐలుగా,14 మంది కానిస్టేబుళ్ళు.. హెడ్ కానిస్టేబుళ్లుగా, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు.
News August 23, 2025
విశాఖలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్

స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా PMAJAY కింద SC యువతీ/యువకులకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 20-40 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువత అర్హులు. విశాఖ జిల్లా వాసులై, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. అర్హులైన 10 మంది (పురుషులు-5, స్త్రీలు-5)కి APSTRC ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. MVP కాలనీ సంక్షేమ భవన్‌లో ఆగష్టు 27లోపు దరఖాస్తు అందజేయాలి.
News August 23, 2025
భర్త, కుమార్తెను చంపిన భార్యకు జీవిత ఖైదు: VZM SP

కట్టుకున్న భర్తను, కన్న కూతూరిని హతమార్చిందో మహిళ. భీమిలి (M)కి చెందిన జ్యోతిర్మయి వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త రమేశ్‌ను ప్రియుడు రాము, మరో ఇద్దరి సహాయంతో చంపింది. ఈ సంఘటన చూసిన కుమార్తెను కొత్తవలసలోని బావిలో పడేశారు. VZM టూటౌన్ PSలో 2015లో హత్య కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో మహిళకు జీవిత ఖైదు, ఇద్దరికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని SP వకుల్ జిందాల్ తెలిపారు.