News August 23, 2025

గణేశ్ విగ్రహాల కొనుగోళ్లు HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

image

గణేశ్ విగ్రహాల కొనుగోళ్ల నేపథ్యంలో నేటి నుంచి బుధవారం రా.10 గం. వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ CP జోయల్ డేవిస్ తెలిపారు. గాంధీ విగ్రహం, పురానాపూల్ నుంచి మంగళహాట్ వైపు వెళ్లే సాధారణ వాహనాలు టక్కర్‌వాడి టీ జంక్షన్, జిన్సీచౌరాహి మీదుగా మళ్లిస్తారు. వచ్చే వాహనాలు గాంధీ విగ్రహం, పురానాపూల్ మీదుగా దూల్‌పేటకు వచ్చి, బోటిగూడ కమాన్ క్రాస్ రోడ్ ద్వారా బయటికెళ్లాలన్నారు.

Similar News

News August 23, 2025

NTR: గణేశ్ ఉత్సవాలకు మండపం పెడుతున్నారా.. ఇది మీ కోసమే

image

ఎన్టీఆర్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలకు మండపాలు ఏర్పాటు చేసేవారు సింగిల్ విండో ద్వారా సులభంగా అనుమతి పొందవచ్చని సీపీ రాజశేఖరబాబు తెలిపారు. https://ganeshutsav.net/ వెబ్‌సైట్‌లో మండపం నిర్వహించేవారు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉత్సవాల అనంతరం నిమజ్జనం తేదీ, వాహన వివరాలు కూడా పోర్టల్‌లో నమోదు చేయాలని సీపీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News August 23, 2025

త్వరలో నేతన్నలకు రూ.25 వేలు: చంద్రబాబు

image

AP: ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ అందిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. ’48 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు వేశాం. అందరు నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. త్వరలోనే నేతన్న భరోసా కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వబోతున్నాం. అదేరోజు సెలూన్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. 40 వేల సెలూన్లకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించబోతున్నాం’ అని తెలిపారు.

News August 23, 2025

బెట్టింగ్ కేసులో కాంగ్రెస్ MLA అరెస్ట్

image

బెట్టింగ్‌ కేసులో కర్ణాటక(చిత్రదుర్గ) కాంగ్రెస్ MLA వీరేంద్ర‌ను ED అరెస్ట్ చేసింది. ఈయన సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రూ.12కోట్ల నగదు, రూ.6కోట్ల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. ఈయన సోదరుడు, సన్నిహితులు బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించి వారి బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన కొద్దిగంటల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం.