News August 23, 2025
పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 25న జాబ్ మేళా

రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి డాక్టర్ రోహిణి శుక్రవారం తెలిపారు. అపోలో ఫార్మసీ, నవత రోడ్డు ట్రాన్స్ పోర్ట్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఆపై చదువులు పూర్తిచేసిన నిరుద్యోగ అభ్యర్థులు హాజరు కావాలన్నారు.
Similar News
News August 23, 2025
విశాఖ ఉక్కుపై సీఎం, డిప్యూటీ సీఎం నోరు మెదపడం లేదు

మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ 35 భాగాలుకు ప్రైవేటు టెండర్లు పిలిచారని వెంటనే ఉపసంహరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బలరాం డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం జిల్లా స్థాయి శిక్షణా తరగతులు 2వ రోజు భీమవరం సీపీఎం ఆఫీసులో జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు కాదని మేం కాపాడుతామని చెప్పిన పెద్దలు నేడు నోరు మెదపకపోవడం దారుణమన్నారు.
News August 23, 2025
NTR: గణేశ్ ఉత్సవాలకు మండపం పెడుతున్నారా.. ఇది మీ కోసమే

ఎన్టీఆర్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలకు మండపాలు ఏర్పాటు చేసేవారు సింగిల్ విండో ద్వారా సులభంగా అనుమతి పొందవచ్చని సీపీ రాజశేఖరబాబు తెలిపారు. https://ganeshutsav.net/ వెబ్‌సైట్‌లో మండపం నిర్వహించేవారు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉత్సవాల అనంతరం నిమజ్జనం తేదీ, వాహన వివరాలు కూడా పోర్టల్‌లో నమోదు చేయాలని సీపీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News August 23, 2025
త్వరలో నేతన్నలకు రూ.25 వేలు: చంద్రబాబు

AP: ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ అందిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. ’48 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు వేశాం. అందరు నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. త్వరలోనే నేతన్న భరోసా కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వబోతున్నాం. అదేరోజు సెలూన్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. 40 వేల సెలూన్లకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించబోతున్నాం’ అని తెలిపారు.