News August 23, 2025

HYD: బంగారం తాకట్టు పెడుతున్నారా? జాగ్రత్త!

image

బ్యాంక్ చెక్కుల మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బంగారం తాకట్టుపెట్టి ఎక్కడైనా చెక్కును తీసుకున్నారా? ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. తమిళనాడుకు, ఛత్తీస్‌గఢ్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చిన వ్యాపారులు HYDలో పలుచోట్ల బంగారం తాకట్టు పెట్టుకుని, FAKE చెక్కులు ఇస్తున్నారు. కావాల్సిన బంగారం వచ్చాక పారిపోతున్నారు. ఇటీవల ఈ స్కామ్‌లు నగరవాసులను కలవరపెట్టాయి. జాగ్రత్త!

Similar News

News September 13, 2025

HYD: మెట్రో నిర్వహణలో అసలేంటి L&Tకి సమస్య

image

L&T ఆధ్వర్యంలో సిటీలో 2017లో మెట్రో ప్రారంభమైంది. ఆ రోజుకు కంపెనీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తం రూ.3,756 కోట్లు. అయితే ఇంతవరకు ఆ మొత్తం సర్కారు చెల్లించలేదు. దీంతో ఆ మొత్తం వడ్డీతో కలిపి 2020 నాటికి రూ.5 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తంతోపాటు ప్రభుత్వం ఇవ్వాల్సిన వయబిలిటీ ఫండ్ రూ.254 కోట్లూ ఇవ్వలేదు. దీంతోతాము ఇక నడపలేమని L&T చెబుతోంది.

News September 13, 2025

యాకుత్‌పురా ఘ‌ట‌న‌కు.. బాధ్యుల‌పై హైడ్రా చ‌ర్య‌లు

image

యాకుత్‌పురా మౌలకా చిల్కాలోనీ మ్యాన్ హోల్లో చిన్నారి ప‌డిపోయిన ఘ‌ట‌న‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది. దీనిపై హైడ్రా క్షుణ్నంగా విచారించింది. బుధ‌వారం సిల్ట్‌ను తొల‌గించ‌డానికి తెర‌చిన మ్యాన్ హోల్ మూయ‌క‌పోవ‌డంతో గురువారం పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో డీఆర్ ఎఫ్ సూప‌ర్‌వైజర్లు ఇద్ద‌రికి డిమోషన్, ఇద్ద‌రిని తొల‌గించాలని ఆదేశించింది.

News September 12, 2025

HYD: మిలాద్ ఉన్ నబి వేడుకల్లో డీజేలు నిషేధం

image

చార్మినార్ PS పరిధిలోని సనా గార్డెన్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీపీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, ఆర్‌&బీ విభాగాల అధికారులు, సుమారు 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. డీజేలు, పటాకులు నిషేధం అని డీసీపీ స్పష్టం చేస్తూ, కార్యక్రమాలు ప్రశాంతంగా, సమయానికి ముగించాలని తెలిపారు.