News August 23, 2025
జన్నారం: కడెం ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ ఫ్లో..

గత 2 రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 3522 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697.150 అడుగుల నీటిమట్టం నిలువ ఉందన్నారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు మిషన్ భగీరథకు మొత్తం 495 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 12, 2026
ఆసిఫాబాద్‌లో పదవ తరగతి పరీక్షల భద్రతా ఏర్పాట్లు

ఆసిఫాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదవ తరగతి (ఎస్‌ఎస్‌సి) పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని, కర్రలు, ఆయుధాలు, రాళ్లు, జిరాక్స్ సెంటర్లపై కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
News March 12, 2026
ఫోన్ పే, గూగుల్ పేలో కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారా?

ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్ ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటిలో కరెంట్ బిల్లుల చెల్లింపు ఆప్షన్ పనిచేయడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో లాగా బిల్ జనరేట్ అవ్వడం లేదని, తాత్కాలికంగా బిల్లర్ డౌన్ అంటూ చూపుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? అయితే విద్యుత్ శాఖ అఫీషియల్ యాప్‌లో పవర్ బిల్ పే చేయొచ్చు.
News March 12, 2026
జగిత్యాల: నేరాల నివారణతో పాటు కేసులు త్వరితగతిన ఛేదించాలి

నేరాల నివారణతో పాటు జరిగిన నేరాలను వేగంగా ఛేదించి బాధితులకు న్యాయం అందించేందుకు పోలీస్ అధికారులు పని చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ క్రైమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి చార్జ్‌షీట్లు సకాలంలో దాఖలు చేయాలని ఆదేశించారు.


