News August 23, 2025
మంచిర్యాల: రాళ్లవాగులో మునిగి వ్యక్తి మృతి

మంచిర్యాలలోని రాళ్లవాగులో మునిగి మతిస్థిమితం సరిగా లేని గొల్ల చిన్న గంగయ్య(38) అనే వ్యక్తి మృతి చెందాడు. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన గంగయ్య కోసం కుటుంబ సభ్యులు గాలించారు. శుక్రవారం ఉదయం రాళ్లవాగులో మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ మజారుద్దీన్ తెలిపారు.
Similar News
News August 23, 2025
రేపు వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సోమిరెడ్డి

గొలగమూడిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమం భాగంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని కార్యాలయ సిబ్బంది తెలిపారు.
News August 23, 2025
GNT: మొదటి ఐదు ర్యాంకుల్లో జిల్లా మంత్రులు

పనితీరు, ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. 1 స్థానంలో నిమ్మల రామానాయుడు, 2 స్థానంలో నారా లోకేశ్, 3 స్థానంలో సత్యకుమార్ యాదవ్, 4 స్థానంలో అనిత, 5 స్థానంలో నాదెండ్ల మనోహర్ ఉన్నారు. మొదటి ఐదు స్థానాలలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉండటంతో గుంటూరు జిల్లా అత్యుత్తమ స్థానంలో స్థానంలో నిలిచింది.
News August 23, 2025
అనకాపల్లి: చీపురు పట్టి శుభ్రం చేసిన ఎస్పీ

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి వ్యర్ధాలను తొలగించారు. ఎస్పీ తుహీన్ సిన్హా స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. పరిశుభ్రతతో అంటూ వ్యాధులు రాకుండా నివారించవచ్చునన్నారు. పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.