News August 23, 2025

సుధాకర్ రెడ్డి కళ్లు, భౌతిక కాయం దానం

image

సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి(83) అనారోగ్యంతో <<17489969>>కన్నుమూసిన<<>> సంగతి తెలిసిందే. ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఇచ్చారు. భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం నుంచి మ.3 గంటల వరకు హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌లో భౌతిక కాయాన్ని ఉంచి, అనంతరం గాంధీ కాలేజీకి అప్పగిస్తారు. సుధాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Similar News

News August 23, 2025

ఆదాయం తగ్గి అప్పులు పెరుగుతున్నాయి: జగన్

image

AP: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని మాజీ CM జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరుగులు పెట్టిస్తామన్నారు. కానీ, 2024-25లో ప్రభుత్వ ఆదాయం(ట్యాక్స్, నాన్-ట్యాక్స్) ఇయర్లీ గ్రోత్ కేవలం 3.08% మాత్రమే. అప్పులు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఐదేళ్లలో మేము రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే.. ఈ 14 నెలల్లోనే రూ.1,86,361 కోట్ల అప్పు చేశారు’ అని విమర్శించారు.

News August 23, 2025

రానున్న 2 గంటల్లో వర్షం!

image

TG: హైదరాబాద్‌లో రానున్న 2 గంటల్లో తేలికపాటి వర్షం పడుతుందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా GHMCలోని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు నార్త్, ఈస్ట్ తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన పడొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News August 23, 2025

త్వరలో నేతన్నలకు రూ.25 వేలు: చంద్రబాబు

image

AP: ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ అందిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. ’48 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు వేశాం. అందరు నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. త్వరలోనే నేతన్న భరోసా కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు ఇవ్వబోతున్నాం. అదేరోజు సెలూన్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. 40 వేల సెలూన్లకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించబోతున్నాం’ అని తెలిపారు.