News April 2, 2024
‘విశ్వంభర’ షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం లింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 19 వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుందట. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలోకి రానుంది.
Similar News
News March 22, 2026
కాబోయే తండ్రుల్లోనూ ‘ప్రెగ్నెన్సీ’ లక్షణాలు

గర్భిణుల్లో వాంతులు, అలసట, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, బరువు పెరగటం సహజం. కానీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొందరు భర్తల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే Couvade సిండ్రోమ్ అంటారు. భాగస్వామితో బలమైన భావోద్వేగ అనుబంధం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 20% మందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. కొందరు పురుషుల్లో హార్మోన్ల మార్పులూ జరుగుతాయని పేర్కొంటున్నారు.
News March 22, 2026
ఈ జిల్లాల్లో వర్షాలు!

తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో ఇవాళ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. Hydలో కూడా స్వల్పంగా వర్షం పడొచ్చని, ఎక్కువగా పొడి వాతావరణమే ఉంటుందని చెప్పింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వివరించింది.
News March 22, 2026
అన్నదాతలకు అన్నగా బాధ్యత తీసుకున్నా: CM రేవంత్

TG: రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నామని CM రేవంత్ తెలిపారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానన్నారు. ‘70L మందికి ₹9,000Cr రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నాం. మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ సిద్దిపేట(D) నర్మెట్ట గ్రామ వేదికగా పథకాన్ని అమలు చేస్తున్నాం. అక్కడ పామాయిల్ పరిశ్రమ, రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.


