News August 23, 2025

TU: M.Ed పరీక్షల తేదీలు ఖరారు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో M.Ed 4వ సెమిస్టర్ రెగ్యులర్ & బ్యాక్ లాగ్ 1, 2, 3 సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షల తేదీలు ఖరారు చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 9 వరకు పరీక్షలు జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. 1, 3 సెమిస్టర్‌లకు ఉదయం, 2, 4 సెమిస్టర్‌లకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.

Similar News

News March 27, 2026

హైదరాబాద్‌: రూ. 217 కోట్ల భారీ జీఎస్‌టీ స్కామ్

image

తెలుగు రాష్ట్రాల్లో రూ. 217 కోట్ల జీఎస్‌టీ కుంభకోణాన్ని డీజీజీఐ (DGGI) అధికారులు ఛేదించారు. 72 షెల్ కంపెనీల ద్వారా ఎలాంటి వస్తు సరఫరా లేకుండానే రూ. 1,472 కోట్ల నకిలీ లావాదేవీలు సృష్టించినట్లు గుర్తించారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి, అక్రమంగా ఐటీసీ (ITC) క్లెయిమ్ చేశారు. హైదరాబాద్, ఏపీల్లో జరిపిన దాడుల్లో కీలక సాక్ష్యాధారాలు, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మన్యంకొండలో వైభవంగా సీతారాముల కళ్యాణం

image

మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ దివ్య ఘట్టాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. రేపు ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.