News August 23, 2025
అటువంటి ఉపాధ్యాయులను వదలొద్దు: ప్రకాశం కలెక్టర్

ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా విద్యార్థినులపట్ల అసభ్యంగా ప్రవర్తించే ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖాధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల పట్ల రాజీపడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో DEO కిరణ్ పలువురు పాల్గొన్నారు.
Similar News
News August 23, 2025
ప్రకాశం ప్రజలకు విద్యుత్ శాఖ SE కీలక సూచన!

జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు శనివారం జిల్లా విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు కీలక సూచన చేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకునే కౌంటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే బిల్లులను ఫోన్ పే, డిపార్ట్మెంట్ యాప్ ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు.
News August 23, 2025
వైసీపీ మాదిరిగా తప్పుడు పనులు చేయం: మంత్రి స్వామి

వైసీపీ నాయకుల మాదిరిగా తాము తప్పుడు పనులు చేయమని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటామంటూ మంత్రి స్వామి అన్నారు. కొండేపిలో నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి స్వామి మాట్లాడారు. ఒక్కొక్క హామీని తాము నెరవేర్చుకుంటూ వస్తున్నామని, వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కృషి చేస్తున్నారన్నారు.
News August 23, 2025
ప్రకాశం: ‘పేదల పార్టీ’కి.. షోకాజ్ నోటీసు జారీ!

పొదిలి మండలం కాటూరి వారి పాలెంకు చెందిన పేదల పార్టీ అనే రాజకీయ పార్టీకి జిల్లా ఎన్నికల అధికారి తమీమ్ అన్సారియా శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శికి నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. ఆరేళ్లుగా ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయనందుకు నోటీసు జారీ చేశారు. వచ్చేనెల 8న ఎన్నికల అధికారి ముందు హాజరు కావాలన్నారు.