News August 23, 2025
ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు!

TG: పార్టీ ఫిరాయింపు MLAలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ చర్యలు ప్రారంభించారు. విచారణకు రావాలని తాజాగా ఐదుగురు MLAలకు నోటీసులు ఇచ్చారు. వారిని విచారించాక మిగతా వారికి నోటీసులిచ్చే ఛాన్సుంది. 10 మంది MLAలు BRS టికెట్‌పై గెలిచి INCలో చేరారని, వారిని అనర్హులుగా ప్రకటించాలని BRS డిమాండ్ చేస్తుండగా తాము పార్టీ మారలేదని పలువురు MLAలు చెబుతున్నారు.
Similar News
News March 13, 2026
వరిలో అగ్గి తెగులును ఎలా నివారించాలి?

వరి దుబ్బు చేసే దశలో అగ్గి తెగులు కనిపిస్తుంది. దీని వల్ల వరి పైర్లలో ఆకులపై నూలు కండె ఆకారం మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద, వెన్నుల మీద గోధుమ రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్క వెన్నువిరిగి వేలాడుతుంది. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 75% 0.6gm లేదా అజాక్సీస్ట్రోబిన్+టెబుకోనజోల్ 2 ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News March 13, 2026
‘కుక్కపిల్లలా ట్రంప్’.. కాలిఫోర్నియా గవర్నర్ పోస్ట్ వైరల్

ట్రంప్‌పై కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. చమురు సంక్షోభం వేళ రష్యన్ ఆయిల్‌ను కొనేందుకు ట్రంప్ ప్రపంచ దేశాలకు APR 11 వరకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో రష్యాకు భారీగా లబ్ధి చేకూరనుంది. ఈ క్రమంలో పుతిన్ ట్రంప్‌ను పెంపుడు కుక్కపిల్లలా కట్టేసి లాక్కెళ్తున్నట్లు ఉన్న ఎడిటెడ్ ఫొటోను గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా ట్రంప్ రిపబ్లికన్, గవర్నర్ న్యూసమ్ డెమోక్రటిక్.
News March 13, 2026
శుక్రవారం రోజున జన్మిస్తే..

శుక్రవారం నాడు జన్మించినవారిపై శుక్రుడి ప్రభావం ఉంటుందని జ్యోతిషులు చెబుతున్నారు. ‘వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అపార సంపద గల యోగాన్ని కలిగి ఉంటారు. కష్టపడితే స్వయంకృషితోనే గొప్ప స్థాయికి చేరుకునే అదృష్టం ఉంటుంది. సినిమా, మీడియా రంగాల్లో రాణిస్తారు. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి ఇంకా మంచి ఫలితాలుంటాయి. వీరు రాజరాజేశ్వరి దేవిని ఆరాధించాలి. లలితా సహస్రనామ పారాయణం చేయాలి’ అని సూచిస్తున్నారు.


