News August 23, 2025
దుబ్బాక: ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

బీమా పథకాలను వినియోగించుకోవాలని SBI దుబ్బాక బ్రాంచ్ మేనేజర్ దమయంతి అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం రాజక్కపేటలో ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండాలని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సామజిక భద్రత పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి యోజన సంవత్సరానికి రూ.436 చెల్లిస్తే సాధారణ మరణానికి రూ.2 లక్షలు పొందవచ్చన్నారు.
Similar News
News March 12, 2026
జగిత్యాల: నేరాల నివారణతో పాటు కేసులు త్వరితగతిన ఛేదించాలి

నేరాల నివారణతో పాటు జరిగిన నేరాలను వేగంగా ఛేదించి బాధితులకు న్యాయం అందించేందుకు పోలీస్ అధికారులు పని చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ క్రైమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి చార్జ్‌షీట్లు సకాలంలో దాఖలు చేయాలని ఆదేశించారు.
News March 12, 2026
పదో తరగతి పరీక్షల కేంద్రాల వద్ద సెక్షన్ 163: ఎస్పీ

ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎస్పీ సంకీర్త్ ఆదేశాల మేరకు 21 పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమికూడరాదని నిషేధం విధించారు. పరీక్షా సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని ఎస్పీ సూచించారు.
News March 12, 2026
మక్తల్ చెరువు కట్ట వద్ద ఘోర ప్రమాదం

మక్తల్ చెరువు కట్ట సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్తల్ నుంచి బయలుదేరిన జీపును హైదరాబాద్ నుంచి వస్తున్న కర్ణాటక వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దండు గ్రామానికి చెందిన జీప్ డ్రైవర్ చిన్నారెడ్డి మృతి చెందినట్లు సమాచారం. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియ రాలేదు.


