News August 23, 2025
NLG: పెరిగిన సర్కారు వారి పాట..!

కొత్త మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వ్యాపారుల్లో కదలిక ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే లిక్కర్ వ్యాపారం మూడు క్వార్టర్లు.. ఆరు బీర్లుగా కొనసాగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న వినియోగం సర్కారుకు కనకవర్షం కురిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 335 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈసారి వైన్ షాపు దరఖాస్తు ధర పెంచడంతో భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
Similar News
News September 8, 2025
నేడు గ్రీవెన్స్ డే రద్దు: ఎస్పీ

నేడు (సోమవారం) నిర్వహించాల్సిన గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆయన అందుబాటులో ఉండని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆయన కోరారు. వచ్చే సోమవారం గ్రీవెన్స్ డే యథావిధిగా జరుగుతుందని తెలిపారు.
News September 7, 2025
రేపటి నుంచి నల్గొండలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్..!

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 8 నుంచి NLG పట్టణంలోని మైసయ్య విగ్రహం సమీపంలో అన్నపూర్ణ క్యాంటీన్ ఆవరణలో మెప్మా, పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. మెప్మా ద్వారా ఉపాధి పొందుతున్న మహిళల ఆధ్వర్యంలో వివిధ రకాల వంటల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
News September 7, 2025
NLG: మాతృ సంస్థలోకి మళ్లీ..!

వీఆర్ఏలు, వీఆర్వోలు తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చారు. ప్రభుత్వం వారిని గ్రామ పాలనాధికారులుగా కొత్తగా నియమించింది. శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కౌన్సిలింగ్ నిర్వహించి క్లస్టర్లను కేటాయించారు. జిల్లాలో 275 క్లస్టర్లు ఉంటే 276 మంది జీపీవోలుగా ఎంపిక చేసింది. సీసీఎల్ఏ నిబంధనల ప్రకారం జీపీఏలకు వారి ర్యాంకులను బట్టి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.