News August 23, 2025
సిద్దిపేట: వారంలో 50వేల మెట్రిక్ టన్నుల యూరియా: MP

రైతులు ఆందోళన చెందవద్దని, వారం లోపు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా తెస్తామని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర అవసరాల మేరకు ఇప్పటికే యూరియాను కేంద్రం పంపించిందని, కృత్రిమ కొరతతోనే సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే యూరియా ఆపరేషన్ సిందూర్ వల్ల సకాలంలో రాకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రైతులను గందరగోళానికి గురి చేయడం సరికాదన్నారు.
Similar News
News March 12, 2026
ఇది కదా రష్యా అంటే..

భారత్‌పై రష్యా మరోసారి తన గౌరవాన్ని చాటుకుంది. రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు ఇండియాకు తాత్కాలికంగా <<19351259>>పర్మిషన్<<>> ఇచ్చామన్న అమెరికా వ్యాఖ్యలపై మన దేశంలోని రష్యా రాయబారి అలిపోవ్ స్పందించారు. ‘మా నుంచి ఆయిల్ కొనేందుకు ఇండియాకు ఏ దేశ పర్మిషన్ అవసరం లేదు. అమెరికా అధికారులు తమ అసలు రంగును మరోసారి బయటపెట్టారు. అమెరికా ఇతర దేశాలను భాగస్వాములుగా కాకుండా తక్కువస్థాయి దేశాలుగా చూస్తుంది’ అని తెలిపారు.
News March 12, 2026
అనకాపల్లి: టెన్త్ పరీక్షలకు 21,017 మంది విద్యార్థులు

ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే టెన్త్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అనకాపల్లి DEO అప్పారావు నాయుడు తెలిపారు. ఉ.9.30 నుంచి మ.12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 102 కేంద్రాల్లో 21,017 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. 5 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించామన్నారు. ఆర్టీసీ ఉచిత బస్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
News March 12, 2026
నెల్లూరు: నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పోతుంది..!

నెల్లూరు జిల్లాలో గ్లకోమా(నీటి కాసుల) బాధితుల సంఖ్య పెరుగుతోంది. నెల్లూరు పెద్దాసుపత్రికి పెద్ద ఎత్తున బాధితులు వస్తున్నారు. 2020లో 250 కేసులు, 2021లో 400, 2022లో 440, 2023లో 500, 2024లో 567, 2025లో 600 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధిని అలసత్వం చేస్తే.. శాశ్వత అంధకారం నెలకొంటుందని GGH కంటి డాక్టర్ వసంత తెలిపారు. మీకూ ఈ సమస్య ఉంటే వెంటనే చెక్ చేసుకోండి.


