News August 23, 2025
కూకట్‌పల్లి: డబ్బుల కోసం వచ్చాడా? బ్యాట్ కోసమా?

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసు నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఓటీటీలో సినిమాలు చూసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లే స్పష్టం అవుతోంది. మరోవైపు దొంగతనం చేయడానికి ఇంట్లోకి రావడమే కాకుండా, ఓ బ్యాట్ గురించి ఈ హత్య జరిగినట్లు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు పోలీసు ఉన్నతాధికారులు నేడు మీడియా సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Similar News
News August 23, 2025
HYD: 24/7 హైడ్రా చర్యలు.. స్పెషల్ REPORT

వర్షాకాలం ముందు నుంచే HYDలో పూడిక తొలగింపు పనులు జరగగా జులై 1 నుంచి పనుల్లో హైడ్రా వేగం పెంచింది. ఇప్పటి వరకు 15,665 క్యాచ్‌పిట్లు, 359 కల్వర్టులను సిబ్బంది శుభ్రపరిచారు. 1,670 నాలాల్లో చెత్తను తొలగించారు. 4,609 వాటర్ లాగింగ్ పాయింట్లు క్లియర్ చేసి, వర్షాకాలంలో 4,974 ప్రాంతాల్లో చెత్తను తొలగించారు. మొత్తంగా జులై 1 నుంచి ఆగస్టు 21 వరకు 27,272 చోట్ల చెత్త, పూడిక తొలగింపు పనులు పూర్తి చేశారు.

HYD: వినాయక చవితి.. పోలీసుల సూచనలు

గణపతి ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఉ.6 గంటల నుంచి రా.10 గంటల వరకు మాత్రమే భక్తిగీతాలను మాత్రమే వినిపించాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు సూచించారు. డీజే, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు నిషేధమని, శోభాయాత్రలు, ర్యాలీలు, పాదయాత్రల నేపథ్యంలో సున్నితమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతాలపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు బందోబస్తు చేపట్టనున్నామని చెప్పారు.