News August 23, 2025
హైదరాబాద్‌కు ‘HILLS’ ఇదీ రోడ్ల పరిస్థితి!

HYDలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంటే తెలియని వారు ఉండరు. భారీ బిల్డింగ్‌లు, కళ్లు చెదిరే ఆర్కిటెక్చర్ అందాలకు ఈ ఏరియాలు మారుపేరు. ధనికులు ఉండే ప్రాంతంగానూ పేరు పొందింది. కానీ.. ఇప్పుడు బంజరాహిల్స్ లాంటి ప్రాంతాల్లో రహదారులు గుంతల మయంగా మారి, అధ్వాన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు జీహెచ్ఎంసీ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది బంజారాహిల్స్ రోడ్ నంబర్- 12 పరిస్థితికి అద్దంపట్టే రోడ్డు ఫొటో.
Similar News
News August 23, 2025
HYD: వినాయక చవితి.. పోలీసుల సూచనలు

గణపతి ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఉ.6 గంటల నుంచి రా.10 గంటల వరకు మాత్రమే భక్తిగీతాలను మాత్రమే వినిపించాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు సూచించారు. డీజే, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు నిషేధమని, శోభాయాత్రలు, ర్యాలీలు, పాదయాత్రల నేపథ్యంలో సున్నితమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతాలపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఈ మేరకు బందోబస్తు చేపట్టనున్నామని చెప్పారు.

రిజర్వేషన్లు, ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక సమీక్షలు

TG: బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై CM రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో PCC కోర్ కమిటీతో సమావేశమయ్యారు. మీనాక్షి, భట్టి, మహేశ్, ఉత్తమ్, శ్రీధర్ బాబుతో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం గాంధీభవన్‌కు వెళ్లారు. అక్కడ జరిగే PAC సమావేశంలో BC రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.