News August 23, 2025

ఇక నుంచి ఎవ్వరికి పెరోల్ లేఖ ఇవ్వను: కోటంరెడ్డి

image

ఇక నుంచి తాను ఎవరికీ పెరోల్ కోసం లేఖలు ఇవ్వనని MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. తాను, గూడూరు MLA సునీల్ ఇచ్చిన లేఖలను హోమ్ శాఖ తిరస్కరించిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య సైతం లేఖలు ఇచ్చారని వాటితోనే శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News August 23, 2025

సజావుగా పోలీస్ కానిస్టేబుల్స్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ : SP

image

కానిస్టేబుల్ ఉద్యోగానికి జరిగిన వివిధ పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాన్ని సాధించిన అభ్యర్థులందరికీ ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని SP కృష్ణ కాంత్ సూచించారు.

News August 23, 2025

తొలి వారం 7.6 లక్షల మంది ‘స్త్రీశక్తి’ ప్రయాణాలు : RM షమీమ్

image

జిల్లాలో స్త్రీశక్తి పథకం ఆరంభించాక తొలి వారం 7,64,311 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షమీమ్ తెలిపారు. శనివారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభం కాగా, 22 వ తేదీ వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ వంటి మూడు రకాల బస్‌లలో మొత్తం 14,88,537 మంది ప్రయాణించారన్నారు.

News August 23, 2025

DSCలో మూడు ఉద్యోగాలు సాధించిన సాయినాథ్

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన కావలి సాయినాథ్ DSC పరీక్షలో ఒకేసారి 3 ఉద్యోగాలు సాధించాడు. PGT SOCIAL – 22nd rank, SA SOCIAL -23 RANK, TGT SOCIAL – 59th Rank సాధించి 3 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. సాయినాథ్‌ను పలువురు అభినందించారు.