News August 23, 2025
HYD: NIMSలో ఆగస్టు 30న BSc నర్సింగ్ కౌన్సెలింగ్

పంజాగుట్ట NIMS ఆస్పత్రి వద్ద బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలకు అభ్యర్థులకు ఈ నెల 30వ తేదీన కౌన్సెలింగ్ ఉంటుందని డీన్ డా.రాజశేఖర్ తెలిపారు. ఇప్పటికే NIMS వెబ్‌సైట్ www.nims.edu.inలో అర్హుల జాబితా అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, కౌన్సెలింగ్ లెటర్ పట్టుకొని నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో ఉ.10 గంటలకు హాజరు కావాలన్నారు.
Similar News
News March 20, 2026
హార్ముజ్ జలసంధిలో టోల్ వసూలు.. ఇరాన్ ప్లాన్!

ప్రపంచ క్రూడాయిల్ సరఫరాలో అతి కీలకమైన హార్ముజ్ జలసంధిని ఉపయోగించుకుని ఆర్థికంగా లాభపడాలని ఇరాన్ ప్లాన్ వేస్తోంది. ఈ మార్గంలో వెళ్లే నౌకల నుంచి టోల్ వసూలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం చట్టం తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. జలసంధిలో సముద్ర రవాణా భద్రత వల్ల లబ్ధి పొందుతున్న దేశాలు ఇరాన్‌కు ఫీజులు, పన్నులు చెల్లించాలని ఓ చట్ట సభ్యుడు చెప్పినట్లు పేర్కొంది.
News March 20, 2026
నేడే రాష్ట్ర బడ్జెట్

TG: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌కు వేళయింది. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలో DyCM భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో క్యాబినెట్ సమావేశమై బడ్జెట్‌ను ఆమోదించనుంది. ఈ ఏడాది బడ్జెట్ ₹3.36 లక్షల కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యం ఉంటుందని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹29 వేల కోట్లు కేటాయించవచ్చని సమాచారం.
News March 20, 2026
భారీ ఆఫర్‌ను తిరస్కరించిన రాజస్థాన్ రాయల్స్?

IPL జట్టు రాజస్థాన్ రాయల్స్ భారీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. కొలంబియా పసిఫిక్ క్యాపిటల్ పార్ట్‌నర్స్(CPCP) కన్సార్షియం వేసిన $1.7 బిలియన్ల(₹16 వేల కోట్లు) బిడ్‌ను ఫ్రాంచైజీ అంగీకరించలేదని NDTV తెలిపింది. మరింత వాల్యుయేషన్ కోసమే RR ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. RCBని కొనుగోలు చేసేందుకు స్వీడన్ కంపెనీ ‘ఈక్యూటీ(EQT)’ ₹18,486 కోట్లకు బిడ్ దాఖలు చేసినట్లు <<19422000>>వార్తలు రావడం<<>> తెలిసిందే.


