News August 23, 2025
ఇక నుంచి ఎవ్వరికి పెరోల్ లేఖ ఇవ్వను: కోటంరెడ్డి

ఇక నుంచి తాను ఎవరికీ పెరోల్ కోసం లేఖలు ఇవ్వనని MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. తాను, గూడూరు MLA సునీల్ ఇచ్చిన లేఖలను హోమ్ శాఖ తిరస్కరించిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య సైతం లేఖలు ఇచ్చారని వాటితోనే శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 14, 2026
అదనపు ఛార్జీలు తీసుకుంటే చర్యలు: RDO

జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రెవెన్యూ డివిజన్ అధికారి భవన అన్నారు. శనివారం ఆర్డీఓ కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. LPG పంపిణి సంస్థలు తప్పనిసరిగా స్టాక్ బోర్డును ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే సిలిండర్ సరఫరా చేయాలన్నారు. అదనపు డెలివరీ ఛార్జీలు వసూలు చేయవద్దని ఆమె హెచ్చరించారు.
News March 14, 2026
శ్రీశైలంలో క్యూలైన్లను పరిశీలించిన ఎస్పీ

ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొని ముందస్తుగా శ్రీశైలానికి భారీ సంఖ్యలో కన్నడ భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ క్యూ లైన్లను ఎస్పీ సునీల్ షోరాణ్ శనివారం పరిశీలించారు. ఉగాది ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్ వారి సూచనలు అనుసరిస్తూ సురక్షితంగా భక్తులు దైవదర్శనం చేసుకోవాలన్నారు.
News March 14, 2026
పార్వతీపురం: ’10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి’

జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO బ్రహ్మాజీరావు శనివారం తెలిపారు. జిల్లాలో 68 పరీక్ష కేంద్రాలలో 10,646 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. మార్చి 16 నుంచి ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 68 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 68 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 3 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 612 ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.


