News August 23, 2025

JGTL: పాదచారుడిని ఢీ కొట్టిన లారీ.. పరిస్థితి విషమం

image

JGTL(D) వెల్గటూర్ మం. కేంద్రంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘనటలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర రహదారిపై స్తంభంపల్లివైపు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అతడు దూరంగా ఎగిరి పడడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావమయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News March 16, 2026

WGL: ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

image

WGL(D) ఖానాపూర్(M)లోని ఓ గ్రామంలో ఐదేళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ప్రసాద్ బాలికను బైక్‌పై కిరాణాషాప్‌కు తీసుకెళ్లి చాక్లెట్ ఇచ్చి సమీప చెరువువద్దకు తీసుకెళ్లి దురాగతానికి ప్రయత్నించినట్లు సమాచారం. బాలిక అరవడంతో సమీపంలోని రైతులు గమనించగా నిందితుడు బాలికను ఇంటివద్ద వదిలివెళ్లిపోగా పోలీసులు దర్యాప్తుచేపట్టారు. పోక్సో కేసు నమోదైంది.

News March 16, 2026

మండుతున్న ఎండలు.. పెంట్లవెల్లిలో 38.6°C

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా పెంట్లవెల్లిలో 38.6°C ఉష్ణోగ్రత నమోదైంది. అచ్చంపేట, కల్వకుర్తిలో 38.5°C, తాడూర్‌లో 38.4°C గా రికార్డయ్యాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

News March 16, 2026

బాలికల వసతి గృహంలో ఆగంతకుడు కలకలం

image

చండ్రుగొండ గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహంలోకి రాత్రివేళ ఓ ఆగంతకుడు గోడదూకి ప్రవేశించడం కలకలం రేపింది. విద్యార్థినులు భయంతో కేకలు వేయడంతో సదరు వ్యక్తి పరారయ్యాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు నిర్వాహకులు ప్రయత్నించగా, విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అధికారులను నిలదీశారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై మండిపడ్డారు. భద్రతా వైఫల్యంపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.