News August 23, 2025
HYD: పీజీ కోర్సుల కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదల

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యుల్‌ను విడుదల చేశారు. MSc బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మషుటికల్ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి సీపీగేట్- 2025 అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కన్వినర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.
Similar News
News August 23, 2025
ప్రజలు పదేపదే ఓట్లు వేసి విసిగిపోతున్నారు: గోయల్

‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు పదేపదే ఓట్లు వేసేందుకు విసిగిపోతున్నారని, అందుకే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం మంచిదన్నారు. దీని వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందంటూ ఏపీ, ఒడిశాను ఉదాహరించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదైందని గుర్తు చేశారు. ఇక ఈ విధానంతో పాలన కూడా మెరుగవుతుందని గోయల్ అభిప్రాయపడ్డారు.
News August 23, 2025
నేను ఏ తప్పూ చేయలేదు: నారాయణస్వామి

AP: లిక్కర్ స్కామ్ కేసులో తాను ఏ తప్పూ చేయలేదని మాజీ Dy.CM నారాయణస్వామి తెలిపారు. సిట్ ప్రశ్నలకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పానని తెలిపారు. ‘నాకు జగన్ ఎప్పుడూ ఏదీ చెప్పలేదు. క్యాబినెట్‌లో లిక్కర్ పాలసీపై నిర్ణయం తీసుకున్నాం. CBNతో శత్రుత్వం లేదు. పాలసీపైనే మాట్లాడుతున్నా. లిక్కర్ స్కాం కేసులో నాకేం సంబంధం లేదని, అంతా పైవాళ్లే చేశారని నేనెక్కడా సిట్ అధికారులకు చెప్పలేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
News August 23, 2025
పెద్దపల్లి: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సదానందం

CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా తాండ్ర సదానందం నియమితులయ్యారు. ఈ నెల 20 నుంచి 22 వరకు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా గాజుల రామారంలో జరిగిన CPI 4వ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సదానందంను ఎన్నుకున్నారు. తనను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకత్వానికి సదానందం కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో CPIని, ప్రజా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.