News August 23, 2025
HYD రావాలని OpenAIకి KTR విజ్ఞప్తి

ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేస్తామని ప్రకటించిన ప్రముఖ AI సంస్థ OpenAIని HYDకు రావాలని మాజీ మంత్రి KTR కోరారు. ‘హైదరాబాద్ అనువైన ప్రాంతం. ఇక్కడ THub, WEHub, TWorks, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సహా ఎన్నో ఉన్నాయి. MNCలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఆపిల్, క్వాల్కమ్‌కు కేంద్రంగా ఉంది. AI విప్లవానికి శక్తినిచ్చే ప్రతిభ, ఆవిష్కరణలు, గ్లోబల్ కనెక్టివిటీని HYD తీసుకొస్తుంది’ అని Xలో పోస్ట్ చేశారు.
Similar News
News August 23, 2025
ప్రజలు పదేపదే ఓట్లు వేసి విసిగిపోతున్నారు: గోయల్

‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు పదేపదే ఓట్లు వేసేందుకు విసిగిపోతున్నారని, అందుకే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం మంచిదన్నారు. దీని వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందంటూ ఏపీ, ఒడిశాను ఉదాహరించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదైందని గుర్తు చేశారు. ఇక ఈ విధానంతో పాలన కూడా మెరుగవుతుందని గోయల్ అభిప్రాయపడ్డారు.
News August 23, 2025
నేను ఏ తప్పూ చేయలేదు: నారాయణస్వామి

AP: లిక్కర్ స్కామ్ కేసులో తాను ఏ తప్పూ చేయలేదని మాజీ Dy.CM నారాయణస్వామి తెలిపారు. సిట్ ప్రశ్నలకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పానని తెలిపారు. ‘నాకు జగన్ ఎప్పుడూ ఏదీ చెప్పలేదు. క్యాబినెట్‌లో లిక్కర్ పాలసీపై నిర్ణయం తీసుకున్నాం. CBNతో శత్రుత్వం లేదు. పాలసీపైనే మాట్లాడుతున్నా. లిక్కర్ స్కాం కేసులో నాకేం సంబంధం లేదని, అంతా పైవాళ్లే చేశారని నేనెక్కడా సిట్ అధికారులకు చెప్పలేదు’ అని ఆయన స్పష్టం చేశారు.
News August 23, 2025
నిద్ర పట్టట్లేదా? మీ సమస్య ఇదే కావొచ్చు!

నిద్రలేమి సమస్యలకు కెఫిన్ కారణం కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల 10-20% దీర్ఘకాలిక నిద్ర సమస్యలొస్తున్నట్లు చెబుతున్నారు. ‘కెఫిన్‌ను జీర్ణం చేసుకునే సామర్థ్యం లేకపోతే నిద్రపట్టదు. అలాంటివారు పడుకోడానికి 6-8 గంటల ముందే కాఫీ, టీ, చాక్లెట్ వంటివి తీసుకోవద్దు. అయినా తగ్గకపోతే పూర్తిగా కెఫిన్ తీసుకోవడం మానేయాలి. కొన్నిరోజుల్లో మార్పు కనిపిస్తుంది’ అని తెలిపారు. SHARE IT