News August 23, 2025
PDPL: ‘జిల్లాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు’

PDPL జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ డా.శ్రీధర్ తెలిపారు. బెడ్స్ నిండినా ఎవరినీ వెనక్కి పంపకుండా ఫోల్డింగ్ మంచాలపై చికిత్స అందిస్తున్నామన్నారు. అవసరమైన మందులందిస్తున్నామని, రక్తపరీక్షలు ఆసుపత్రిలోనే చేస్తున్నామన్నారు. 100పడకల కొత్తాసుపత్రి పూర్తైతే స్థల సమస్య తగ్గుతుందని, సిబ్బంది తమ సామర్థ్యానికి మించి సేవలందిస్తున్నారని అన్నారు. ప్రజలు సహకరించాలన్నారు.
Similar News
News August 23, 2025
రాజమండ్రి: కొత్త బార్ పాలసీలో కల్లు గీత కార్మికులకు ప్రాధాన్యం

మద్యం నియంత్రణ, వ్యాపార పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త బార్ పాలసీని అమల్లోకి తెచ్చిందని ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. ఈ పాలసీలో భాగంగా బార్లలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం రాజమండ్రిలో ఉమ్మడి తూ.గో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, స్టేషన్ సీఐలతో ఆయన సమావేశం నిర్వహించారు.
News August 23, 2025
HYD: పీఏసీ సమావేశాలు ప్రారంభం.. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వంపై హర్షం

HYD గాంధీభవన్‌లో పీఏసీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఓటు చోరీపై ప్రత్యేక ప్రచార లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు.
News August 23, 2025
GWL: మట్టి విగ్రహాలు వాడదాం- పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

మట్టి విగ్రహాలు వాడి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముద్రించిన వాల్ పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్ రావు, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి శనివారం ఐడీఓసీ మందిరంలో విడుదల చేశారు. గణేష్ ఉత్సవాల్లో మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మట్టి విగ్రహాలు నీటిలో సులువుగా కరుగుతాయని చెప్పారు.