News August 23, 2025

HYD: జానపద దినోత్సవం రోజే రంగస్థల నటుడి మృతి

image

ప్రముఖ రంగస్థల నటుడు పూర్ణచంద్రశేఖర్‌ (73) గుండెపోటుతో మృతి చెందారు. శేరిలింగంపల్లిలో ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దేశ, విదేశాలల్లో చంద్రశేఖర్ అనేక ప్రదర్శనతో పేరుగాంచిన ఆయన జానపద దినోత్సవం రోజే కన్నుమూయడం కళకారులను కంటితడిపెట్టించింది. 2006లో చమన్‌లాల్‌ అవార్డు, AP ఉగాది పురస్కారం, 6 సార్లు నంది అవార్డులు అందుకున్నారు.

Similar News

News April 3, 2026

HYDలో పెరుగుతున్న ఎండలు.. జర జాగ్రత్త..!

image

హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే నమోదవుతున్నాయని టీజీడీపీఎస్ వెల్లడించింది. దుండిగల్, మౌలాలి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలుల ధాటికి నగరవాసులు అల్లాడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News April 3, 2026

TG: ఇసుక విక్రయాల ఆదాయంలో భారీ వృద్ధి 

image

గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2025-2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 3.71లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయాలు జరగ్గా, రూ.1,008 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు GOVT ఇసుక మాఫియాను సమర్థంగా అరికట్టింది. గతేడాది ప్రభుత్వం రూ.738కోట్లు మాత్రమే ఆర్జించింది.  స్థానికంగా ఇసుక లభ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో 17, HYD చుట్టూ 4 ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

News April 3, 2026

HYD: రూ.500 కోట్ల ఫీజులు నిలిచిపోయి సామాన్యుల తిప్పలు!

image

HYD శివారులోని 74 గ్రామ పంచాయతీల పరిధిలో హెచ్ఎండీఏ (HMDA), కొత్తగా ఏర్పాటైన ఎఫ్‌సీడీఏ (FCDA) మధ్య తీవ్ర అధికార పోరు సాగుతోంది. లేఅవుట్ పర్మిషన్లు, డెవలప్‌మెంట్ ఫీజుల రూపంలో వచ్చే సుమారు రూ.500 కోట్ల ఆదాయం ఎవరికి చెందాలనే దానిపై స్పష్టత లేక ఫైళ్లు పెండింగ్‌లో పడ్డాయి. రెండు సంస్థల జోక్యంతో న్యాయపరమైన చిక్కులు వస్తుండటంతో అటు పర్మిషన్లు రాక సామాన్యులు, ఇటు ఆదాయం లేక ఖజానా నష్టపోతున్నాయి.