News August 23, 2025
నేడు ఖాతాల్లోకి డబ్బులు

AP: 2014-19 మధ్య జరిగిన నరేగా(ఉపాధి హామీ పథకం) పనుల బిల్లులు ఇవాళ విడుదల కానున్నాయి. క్లోజ్ చేసిన 3,54,177 పనులను CM చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి ఆన్ గోయింగ్ వర్కులుగా మార్పు చేయించారని TDP తెలిపింది. దీంతో ₹180Cr చెల్లింపులకు మార్గం ఏర్పడిందని, అందులోంచి ₹145Cr ఇవాళ కాంట్రాక్టర్లు, కార్మికుల ఖాతాల్లో జమ కానున్నట్లు పేర్కొంది. YCP ప్రభుత్వం కుట్ర పూరితంగా వీటిని నిలిపివేసిందని ఆరోపించింది.
Similar News
News August 23, 2025
ఆ తర్వాతే ఫాతిమా కాలేజీపై చర్యలు: రంగనాథ్

TG: చాంద్రాయణగుట్ట సల్కం చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువు ఫైనల్ నోటిఫికేషన్, FTL వెరిఫికేషన్ పూర్తి తర్వాత కూల్చివేతపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. తొందరపాటు చర్యలతో న్యాయపరమైన చిక్కులు వస్తాయన్నారు. 2016లో చెరువుపై ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వగా ఫైనల్ నోటిఫికేషన్ ఇప్పటికీ ఇవ్వలేదని తెలిపారు. నిబంధనల ప్రకారమే చర్యలు ఉంటాయన్నారు.
News August 23, 2025
ప్రజలు పదేపదే ఓట్లు వేసి విసిగిపోతున్నారు: గోయల్

‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు పదేపదే ఓట్లు వేసేందుకు విసిగిపోతున్నారని, అందుకే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం మంచిదన్నారు. దీని వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందంటూ ఏపీ, ఒడిశాను ఉదాహరించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదైందని గుర్తు చేశారు. ఇక ఈ విధానంతో పాలన కూడా మెరుగవుతుందని గోయల్ అభిప్రాయపడ్డారు.
News August 23, 2025
నేను ఏ తప్పూ చేయలేదు: నారాయణస్వామి

AP: లిక్కర్ స్కామ్ కేసులో తాను ఏ తప్పూ చేయలేదని మాజీ Dy.CM నారాయణస్వామి తెలిపారు. సిట్ ప్రశ్నలకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పానని తెలిపారు. ‘నాకు జగన్ ఎప్పుడూ ఏదీ చెప్పలేదు. క్యాబినెట్‌లో లిక్కర్ పాలసీపై నిర్ణయం తీసుకున్నాం. CBNతో శత్రుత్వం లేదు. పాలసీపైనే మాట్లాడుతున్నా. లిక్కర్ స్కాం కేసులో నాకేం సంబంధం లేదని, అంతా పైవాళ్లే చేశారని నేనెక్కడా సిట్ అధికారులకు చెప్పలేదు’ అని ఆయన స్పష్టం చేశారు.